తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం ‘జైలర్’ (Jailer) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన జైలర్ పోస్టర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
తాజా అప్డేట్ ప్రకారం చెన్నైలో మొదటి షెడ్యూల్ కోసం పోలీస్ స్టేషన్ సెట్ వేశారట మేకర్స్. ఈ షూటింగ్ పార్టులో రజినీకాంత్‌తోపాటు పలువురు నటీనటులు పాల్గొనున్నారని టాక్. జైలర్ చిత్రంలో అందాల తార ఐశ్వర్యరాయ్ హీరోయిన్గా నటించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.
జైలర్ చిత్రంలో శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ ఇతర కీ రోల్స్ పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.
#Jailer begins his action Today!@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/6eTq1YKPPA
— Sun Pictures (@sunpictures) August 22, 2022