Jailer Movie Sequel | దాదాపు పుష్కర కాలం తర్వాత రజనీ భీభత్సమైన హిట్టు కొట్టాడు. కేవలం నాలుగు రోజుల్లోనే మూడొందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర వీరవిహారం చేస్తున్నాడు. రోబో తర్వాత ఆ స్థాయి హిట్టు పడలేదే అని నిరాశలో ఉన్న తలైవా ఫ్యాన్స్‌కు చొక్కాలు చింపుకునే రేంజ్ బొమ్మ పడింది. రజనీకి సరైన కథ పడితే అవుట్ పుట్ ఏ రేంజ్లో ఉంటుందోనని జైలర్‌తో స్పష్టమైంది. ముఖ్యంగా రజనీ సినిమాలకు తెలుగునాట హౌజ్ ఫుల్ బోర్డ్‌లు చూసి ఎన్నో ఏళ్లయింది. 2.ఓ, కబాలి, పేట వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి. దాంతో రజనీ క్రేజ్ అంతకంతకూ పడిపోతూ వచ్చింది. అయితే ఇన్నాళ్లు తగ్గుతూ వచ్చిన మార్కెట్‌ను జైలర్‌తో మళ్లీ పుంజుకునేలా చేసుకున్నాడు తలైవా.
కేవలం మూడు రోజుల్లోనే రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ మార్క్ కంప్లీట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్లను ప్రాఫిటెబుల్ వెంచర్లోకి పడేశాడు. ఫైనల్ రన్లో ఈ సినిమా పాతిక, ముప్పై కోట్ల షేర్‌ను రాబట్టినా పెద్దగా ఆశ్యర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్లో ఈ సినిమా టిక్కెట్లు తెగుతున్నాయి. పైగా పోటీగా రిలీజైన భోళా పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో యూత్ సహా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ జైలర్కే ఓటు వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే రజనీ ఫ్యాన్స్‌కు నెల్సన్ మరో బంపర్ అప్డేట్ను వెల్లడించాడు.
జైలర్‌కు సీక్వెల్‌ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. జైలర్-2 ఖచ్చితంగా ఉంటుందని, కాకపోతే కాస్త టైమ్ పడుతుందని చెప్పాడు. ఈ అప్డేట్తో రజనీ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. జైలర్ సినిమానే ఈ స్థాయిలో ఉంటే.. పార్ట్-2 ఇంకా ఏ స్థాయిలో ఉంటుందోనని అప్పుడే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన జైలర్‌లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. వీళ్ల ఎంట్రీకి ఆడియెన్స్ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లేలా చేశారు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అయితే సంభవమే. గూస్బంప్స్ అనే పదం కూడా చిన్నదేనేమో అనే స్థాయిలో మ్యూజిక్ ఇచ్చాడు. మొత్తంగా జైలర్‌తో సూపర్ స్టార్ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు.