Jailer 2 | ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ .. అక్టోబర్‌లో రజనీకాంత్ మాస్ ట్రీట్‌కు రంగం సిద్ధం!
Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న తలైవా, ఇప్పుడు తన క్రేజీ ప్రాజెక్ట్‌లతో అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ‘జైలర్’ సూపర్ హిట్ తర్వాత వస్తోన్న ‘జైలర్ 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jailer 2 | సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న తలైవా, ఇప్పుడు తన క్రేజీ ప్రాజెక్ట్‌లతో అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా ‘జైలర్’ సూపర్ హిట్ తర్వాత వస్తోన్న ‘జైలర్ 2’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌తో రజినీకాంత్ మరోసారి జతకట్టగా, ఇప్పుడు ఈ సీక్వెల్ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా సాగుతున్నాయని సమాచారం. ఇదే సమయంలో రజినీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇక ‘జైలర్ 2’ విడుదల తేదీపై తాజాగా ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాజా టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ‘జైలర్’ చిత్రానికి సంగీతంతో ప్రాణం పోసిన అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కూ సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మొదటి భాగంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘జైలర్ 2’లో కూడా పలువురు స్టార్ హీరోలు, ప్రముఖ నటులు కీలక క్యామియో పాత్రల్లో కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ‘జైలర్’తో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన రజినీకాంత్-నెల్సన్ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, స్టైల్, మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అక్టోబర్ 16 విడుదల తేదీపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ ఇదే తేదీ ఖరారైతే, దసరా సీజన్లో రజినీకాంత్ మరోసారి బాక్సాఫీస్‌ను శాసించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

