Paatal Lok Season 2 | అమెజాన్ ప్రైమ్ వీడియో(Prime Video)లో టెలికాస్ట్ అయ్యే వెబ్ సిరీస్‌లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రైమ్ నుంచి వచ్చిన మీర్జాపుర్, ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వెబ్ సిరీస్‌లు సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే ఇలానే సైలెంట్‌గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న మరో వెబ్ సిరీస్ పాతాల్ లోక్(Paatal Lok). విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్కా శర్మ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కరోనా లాక్డౌన్ టైంలో విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌లో ఇన్స్పెక్టర్ హాథీరామ్ చౌదరీ పాత్రలో నటించాడు బాలీవుడ్ నటుడు జైదీప్ అహ్లవత్ (Jaideep Ahlawat). ఒక మధ్య తరగతి తండ్రిగా.. పోలీస్ స్టేషన్లో ఎవరు గుర్తించని ఇన్స్పెక్టర్గా జీవించేశాడు జైదీప్ అహ్లవత్. ఫస్ట్ సీజన్ వచ్చిన అనంతరం దీనికి వచ్చిన ప్రశంసలలో సగం జైదీప్ అహ్లవత్కే దక్కింది. అయితే ఇదే క్రేజ్‌తో ఇప్పడు పాతాల్ లోక్ సీజన్ 2 వచ్చి ప్రైమ్‌లో సందడి చేస్తుంది.
ఇదిలావుంటే ఈ సిరీస్ కోసం జైదీప్ అహ్లవత్ తీసుకున్న జీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాతాల్ లోక్ ఫస్ట్ సీజన్ కోసం కేవలం రూ. 40 లక్షల జీతం తీసుకున్న అందుకున్న జైదీప్ రెండో సీజన్ కోసం ఏకంగా రూ.20 రెమ్యూనరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు విన్న నెటిజన్లు ఇది సక్సెస్ అంటే అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరూ.. హాథీరామ్ చౌదరీ పాత్ర కోసం మరో రూ.20 కోట్లు ఇచ్చిన తప్పులేదంటున్నారు.