LSG vs PBKS | ఇంగ్లిస్, బదొని మెరుపులు.. పంజాబ్ గెలిచి నిలిచేనా..!
LSG vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్(LSG) భారీ స్కోర్‌తో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు సవాల్ విసిరింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(72) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. అయుశ్ బదొని(43) ధనాధన్ ఆటతో అలరించాడు.
LSG vs PBKS : ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్(LSG) భారీ స్కోర్‌తో పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు సవాల్ విసిరింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(72) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. అయుశ్ బదొని(43) ధనాధన్ ఆటతో అలరించాడు. మిడిలార్డర్‌ను చాహల్(2-21) కట్టడి చేయగా.. డెత్ ఓవర్లలో అబ్దుల్ సమద్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. దాంతో, పంజాబ్‌కు లక్నో 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. వరుసగా ఆరు ఓటములతో వెనకబడిన శ్రేయస్ అయ్యర్ సేన గెలిస్తేనే ప్లే ఆఫ్స్ పోటీలో నిలుస్తుంది.
సొంత మైదానంలో దంచేయాలనుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ను పంజాబ్ మోస్తరు స్కోర్‌కే కట్టడి చేసింది. మిచెల్ మార్ష్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కులకర్ణి(0)ని ఒమర్జాయ్ ఔట్ చేయగా.. డేంజరస్ పూరన్(2)ను యాన్సెన్ బౌల్డ్ చేసి లక్నోకు ఆదిలోనే షాకిచ్చారు. ఓపెనర్ ఇంగ్లిస్(72) జతగా ఆయుశ్ బదొని(43) ధనాధన్ ఆడాడు. ఒమర్జాయ్కు చుక్కలు చూపిస్తూ రెండు ఫోర్లు, సిక్సర్ బాదగా పవర్ ప్లేలో లక్నో 66 రన్స్ చేసింది. కానీ, చాహల్(2-21) బౌలింగ్‌లో బదొని స్టంసౌట్ కావడంతో లక్నో స్కోర్ నెమ్మదించింది.
Innings Break!
Josh Inglis and the middle-order lift #LSG to 196/6 👏
Will #PBKS chase it down? 🤔
Scorecard ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/mZNc3eTSLe
— IndianPremierLeague (@IPL) May 23, 2026
పంత్ మళ్లీ
బదొని తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(26) కుదురుకున్నట్టే కనిపించినా ఎక్కువ సేపు నిలవలేదు. చాహల్ ఓవర్లో పెద్ద షాట్ ఆడబోయి యాన్సెన్ చేతికి చిక్కాడు. అర్ధ శతకంతో రెచ్చిపోయిన ఇంగ్లిస్‌ను శశాంక్ సింగ్ ఔట్ చేసి ఐదో వికెట్ అందించాడు. అనంతరం.. ముకుల్ చౌదరీ(1) విఫలమైనా.. డెత్ ఓవర్లలో అబ్దుల్ సమద్(37) బ్యాట్ ఝులిపించాడు. అర్ష్‌దీప్ వేసిన ఆఖరి ఓవర్లో సిక్స్, ఫోర్‌తో 17 రన్స్ పిండుకోగా.. లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి196 పరుగులు చేసింది.
Swinging the momentum #LSG‘s way 💪
🎥 Abdul Samad with a fiery flourish in the final over 💥
Scorecard ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS | @LucknowIPL pic.twitter.com/GRv7JXQXmu
— IndianPremierLeague (@IPL) May 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

