Adipurush Movie Song | ప్రభాస్ లైనప్‌లో అందరినీ ఎగ్జైట్ చేస్తున్న ప్రాజెక్ట్‌లో ఆదిపురుష్ ఒకటి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై నెగెటీవిటి ఎంతుందో పాజిటీవిటి కూడా అంతే ఉంది. మూడు నెలల క్రితం రిలీజ్ చేసిన టీజర్‌కు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. ఒక వర్గానికి చెందిన ఆడియెన్స్‌కు మాత్రం తెగ నచ్చింది. పైగా 3డీలో టీజర్ అదిరిపోయిందంటూ కామెంట్స్ కూడా చేశారు. ఇక ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేసిన శ్రీరామ నవమి పోస్టర్, హనుమాన్ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీగా గడుపుతున్నారు.
కాగా గురవారం హనుమాన్ జయంతి సందర్భంగా మేకర్స్ హనుమాన్ పోస్టర్‌తో పాటు జైశ్రీరామ్ అంటూ సాగే ఓ సాంగ్ క్లిప్‌ను కూడా రిలీజ్ చేసింది. 59సెకండ్ల నిడివి ఉన్న ఈ పాట గూస్బంప్స్ తెప్పిస్తుంది. స్మాల్ స్క్రీన్లోనే ఈ రేంజ్లో రోమాలు నిక్కబొరుస్తే.. థియేటర్ స్క్రీన్‌పైన ఇంకా ఏ విధంగా ఆకట్టుకుందోనని పలువురు నెటీజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అజయ్-అతుల్ స్వర పరిచిన ఈ పాటకు మనోజ్ ముంతాషిర్ సాహిత్యం అందించాడు. ఇక గురువారం ఉదయం రిలీజైన హనుమాన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కృతిసనన్ నటించింది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. అన్ని సవ్యంగా జరిగితే ఆదిపురుష్ సినిమా రిలీజై ఇప్పటికే ముడు నెలలు అయ్యుండేది. టీజర్‌కు మిశ్రమ స్పందన రావడంతో మేకర్స్ వీఎఫ్ఎక్స్ కోసం మరో వంద కోట్లు మేకర్స్ వెచ్చించారు. ఈ సినిమాను జూన్ 16న ఇండియాతో పాటు పలు దేశాల్లో విడుదల కానుంది.