Jai Hanuman | చిన్న చిత్రంగా ప్రారంభమై పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన హనుమాన్‌కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న జై హనుమాన్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు పనులను వేగవంతం చేశారు. ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లో కీలక భాగంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఫిబ్రవరిలో కర్ణాటకలోని అంజనాద్రి బెట్ట వద్ద ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం చిత్రీకరణ సైలెంట్‌గా, పక్కా ప్రణాళికతో కొనసాగుతోంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుంది.
ఈ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించడం. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అలాగే రానా దగ్గుబాటి కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం. మొదటి భాగంలో హీరోగా మెప్పించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లోనూ కొనసాగనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక టెక్నికల్ టీమ్‌లో జరిగిన మార్పులు కూడా ఆసక్తిని పెంచుతున్నాయి. ‘హనుమాన్’కు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన శివేంద్ర దాశరథి స్థానంలో ఈ సీక్వెల్ కోసం నిమిష్ రవి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న ఆయన, ఈ ప్రాజెక్ట్‌కు కొత్త విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారని భావిస్తున్నారు. అలాగే సంగీతం విషయంలో కూడా పెద్ద మార్పు చోటుచేసుకుంది.
మొదటి భాగానికి గౌర హరి సంగీతం అందించగా, ఈసారి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం. ఎం. కీరవాణి రంగంలోకి దిగారు. ఆయన సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది.2024 సంక్రాంతి సందర్భంగా విడుదలైన ‘హనుమాన్’ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. చిన్న చిత్రంగా ప్రారంభమై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. అదే స్థాయిలో, అంతకంటే పెద్దగా ‘జై హనుమాన్’ను తెరకెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.తెలుగు సహా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తోంది.