Jai Bheem: జై భీమ్ ట్రైలర్‌తో దుమ్ము రేపిన సూర్య

తమిళ నటుడు సూర్య వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో అలరించిన సూర్య ఇప్పుడు జై భీమ్ చిత్రంతో సందడి చేయనున్నాడు. చట్టం బలమైన ఆయుధం, అయితే ఎవరిని కాపాడటానికి మనం దానిని ఉపయోగిస్తున్నాం అనేది ప్రధానం’ ఇదే అంశంపై తెరకెక్కింది ‘జై భీమ్’ చిత్రం.
తప్పుడు కేసులో ఇరికించిన గిరిజనులవైపు పోరాడే పాత్రలో సూర్య లాయర్‌గా నటించాడు. అతనితో కోర్టులో తలపడే మరో కీలకమైన లాయర్ పాత్రను రావు రమేశ్ పోషించగా, పోలీస్ అధికారి పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించారు. తాజాగా ట్రైలర్ విడుదల చేయగా, ఇందులోని సన్నివేశాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘పోరాడుదాం పోరాడుదాం.. న్యాయం జరిగేవరకు పోరాడుదాం’ అన్న నినాదాలతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అమాయక గిరిజనుల కోసం పోరాడుతున్న లాయర్‌గా సూర్య అదరగొట్టాడు.
‘జై భీమ్’ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని 2 డి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు.అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం సూర్య వరుసగా నాలుగు సినిమాలను నిర్మించి ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో ఇదొక సినిమా. త.సె. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’లో ఇతర ప్రధాన పాత్రలను రజీషా విజయన్, మణికందన్, లిజో మోల్ జోస్ పోషించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

