కోవిడ్ వలన ప్రస్తుత పరిస్థితులు అన్ని పూర్తిగా మారిపోయాయి. ఒకరిపై ఆధారపడకుండా తమ పని తామే చేసుకోవడం నేర్చుకున్నారు. సెలబ్రిటీలు సైతం ఇదే మార్గంలో పయనిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండంతో చాలా మంది నటులు తమకు తాము మేకప్ వేసుకోవడం, అసిస్టెంట్ చేసే పనులు వారే చేసుకోవడం అలవాటు చేసుకున్నారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సీనియర్ స్టార్ నటుడు జగ్గు భాయ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. కరోనాకి థాంక్స్ చెబుతూ దాని మూలాన నాకు నేను మేకప్ మెన్ మారి మేకప్ వేసుకుంటున్నాని ఓ ఫొటోతో షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. జగపతి బాబు గతంలో ఫ్యామిలీ హీరోగా అలరించారు. ఇప్పుడు సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లోను జగపతిబాబు సత్తా చాటుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్నారు.
Thanks to covid..I have become my own make up man. Ha haa.#StayHomeStaySafe pic.twitter.com/oeOBGEkrWd
— Jaggu Bhai (@IamJagguBhai) April 18, 2021