Jagapathi Babu | నీకు తిండి లేకపోతే మా ఇంటికి రా .. జగపతి బాబుకి ఫోన్ చేసి తిట్టిన ఫ్యాన్
Jagapathi Babu | ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోగా మంచి స్టార్డమ్ అనుభవించిన ఆయన, తర్వాత కూడా తనను తాను మార్చుకుంటూ ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
Jagapathi Babu | ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జగపతి బాబు ప్రస్తుతం విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోగా మంచి స్టార్డమ్ అనుభవించిన ఆయన, తర్వాత కూడా తనను తాను మార్చుకుంటూ ఇప్పుడు టాలీవుడ్లో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టకాలం, డబ్బుల కోసం ఇష్టంలేని సినిమాలు కూడా చేయాల్సి వచ్చిన పరిస్థితుల గురించి జగపతి బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన కెరీర్లో చేసిన ఓ సినిమా గురించి మాట్లాడిన ఆయన, ఆ సినిమా చూసిన తర్వాత తన అభిమానిలో ఒకరు ఫోన్ చేసి తీవ్రంగా తిట్టిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జగపతి బాబు మాట్లాడుతూ.. “నేను చాలా వరస్ట్ పొజిషన్లో ఉన్న సమయంలో ఆరు అనే సినిమా చేశాను. నిజం చెప్పాలంటే అది నేను కేవలం డబ్బుల కోసం చేసిన సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని నాకు ముందే తెలుసు. అసలు రిలీజ్ కూడా అవ్వదనుకున్నాను” అంటూ ఓపెన్‌గా చెప్పారు.ఇక ఆ సినిమా విడుదలైన తర్వాత జరిగిన సంఘటనను చెబుతూ ఆయన నవ్వుకున్నారు. నాకు కాకినాడలో ఓ పెద్ద ఫ్యాన్ ఉన్నాడు. సినిమా చూసిన వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తగానే ‘ఏంట్రా ఆరా? రేపు ఏడు, ఐదు అని కూడా సినిమాలు తీస్తావా?’ అని మొదలుపెట్టాడు” అంటూ సరదాగా గుర్తు చేసుకున్నారు.
అంతటితో ఆగకుండా ఆ అభిమాని తనపై ప్రేమతోనే కోపంగా మాట్లాడాడని జగపతి బాబు తెలిపారు. “నీకు తిండి లేకపోతే చెప్పు.. మా ఇంటికి రా, నేను పెడతాను. కానీ ఇలాంటి ఎదవ సినిమాలు మాత్రం చేయొద్దు” అని అతను అన్నాడని వెల్లడించారు. ఆ మాటలు విన్నప్పుడు తనకు నవ్వొచ్చిందని, కానీ అభిమానులు తనపై ఎంత ప్రేమతో ఉంటారో అప్పుడు అర్థమైందని చెప్పారు. జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..ఇక ఆరు సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రానికి శ్రీకాంత్ లింగద్ దర్శకత్వం వహించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2012లో విడుదలైంది. అయితే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది.హీరోగా వరుస ఫ్లాప్స్ ఎదుర్కొన్న తర్వాత జగపతి బాబు కెరీర్లో భారీ మలుపు తిరిగింది. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్‌గా నటించిన తర్వాత ఆయనకు కొత్త ఇమేజ్ వచ్చింది. అప్పటి నుంచి విలన్, క్యారెక్టర్ రోల్స్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

