Jagapathi Babu | టాలీవుడ్లో ఇప్పుడు ట్రెండ్ మారింది. సినిమాల్లో నటించే స్టార్లు టీవీ, ఓటీటీ షోల హోస్టులుగా మారి ప్రేక్షకులని ఎంతగా అలరిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చిరంజీవి, బాలయ్య, నాగార్జున వంటి వారు సందడి చేస్తుండగా, ఇప్పుడు ఈ జాబితాలో చేరారు జగపతి బాబు. హీరోగా ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన ఆయన, రెండో ఇన్నింగ్స్‌లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మళ్లీ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు మరో కొత్త పాత్రలో హోస్ట్‌గా ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే టాక్ షోతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు.ఈ షోలో ప్రముఖుల్ని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తూ, వారి జీవితంలో ఆసక్తికర ఘటనలు, భావోద్వేగాలు, అనుభూతులను చర్చించనున్నారు.
ఇప్పటికే మొదటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. దీనికి కింగ్ నాగార్జున ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అన్నయ్య వెంకట్, సోదరి నాగ సుశీల కూడా ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో వారు ఎన్నో వ్యక్తిగత విషయాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ప్రోమోలో వారిద్దరి మధ్య హాస్యం, స్నేహితుల మధ్య ఉండే అనుబంధం స్పష్టంగా కనిపించింది. ఓ సందర్భంలో జగపతి బాబు.. రమ్యకృష్ణ, టబు గురించి నాగ్ని అడగగా, అందుకు సమాధానం చెప్పనని అన్నాడు. అలానే నీ ఫేవరేట్ యాక్ట్రెస్ రమ్యకృష్ణ, సౌందర్యనా అని తిరిగి నాగ్ ప్రశ్నించాడు.దాంతో జగపతి బాబు ఇది నా ఇంటర్వ్యూ కాదని అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జగపతి బాబు, నాగార్జున ఫ్యాన్స్ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ టాక్ షో జీ తెలుగు ఛానల్లో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. మొదటి ఎపిసోడ్ ఆగస్టు 17న టెలికాస్ట్ కానుంది. ఇప్పటికే వినూత్న కాన్సెప్ట్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో, జగపతి బాబుకు హోస్ట్‌గా మరో విజయవంతమైన ప్రస్థానానికి నాంది పలకుతుందేమో చూడాలి. విలన్‌గా అదరగొడుతున్న జగపతి బాబు ఇప్పుడు హోస్ట్‌గా కూడా సత్తా చాటుతాడా అనే దాని కోసం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.