జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘సింబా’. ఈ చిత్రంలో ఆయన ప్రకృతి తనయుడిగా కనిపించబోతున్నారు. ‘ది ఫారెస్ట్ మ్యాన్’ అనేది ట్యాగ్ లైన్. అడవి నేపథ్యంతో సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రాన్ని సంపత్ నంది టీమ్ వర్క్స్ సమర్పణలో రాజ్ దాసరి ప్రొడక్షన్స్ పతాకంపై సంపత్ నంది, రాజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ లుక్లో చెట్లను భుజాలపై మోసుకుంటూ వెళ్తున్నారు జగపతిబాబు. ‘ప్రకృతి తనయుడు ఇతడు. సింబాగా జగపతి బాబును పరిచయం చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’ అంటూ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం : డి కృష్ణ సౌరభ్, సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్.