జగపతి బాబు, ఆశిష్ గాంధీ, మమతా మోహన్‌దాస్, విమల రామన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రుద్రంగి’. రసమయి ఫిలింస్ పతాకంపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అజయ్ సామ్రాట్ దర్శకుడు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. స్వాతంత్ర కాలం నాటి తెలంగాణ సామాజిక పరిస్థితులను చూపిస్తూ టీజర్ సాగింది. చారిత్రక అంశాల నేపథ్యంతో సాగే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, మంచి ప్రొడక్షన్ వాల్యూస్, ఉన్నత సాంకేతిక విలువలతో సినిమాను రూపొందించామని చిత్రబృందం చెబుతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సంతోష్ శనమోని, సంగీతం : నాఫల్ రాజా ఏఐఎస్.