Pawan Kalyan | జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జడ్చర్ల తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి బహిరంగంగా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ చేసిన ‘నర దిష్టి’ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ ప్రతిపక్ష నేతలతో పాటు కాంగ్రెస్ మంత్రులు మూకుమ్మడిగా దాడికి దిగారు. తాజాగా జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) మరోసారి పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన అనిరుధ్ రెడ్డి, పవన్ కళ్యాణ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికి క్షమాపణలు చెప్పలేదు. అతడు క్షమాపణలు చెప్పకుంటే ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను. ఇది నా ఫైనల్ వార్నింగ్. పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకోని క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు. వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే వాళ్ళు కూడా ఈ వివాదంపై కచ్చితంగా దీనిపై స్పందిస్తారంటూ అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) వెల్లడించారు.
బ్రేకింగ్ న్యూస్
పవన్ కళ్యాణ్‌కు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఇకపై జడ్చర్లలో పవన్ కళ్యాణ్ సినిమాలు నేను ఆడనివ్వను
పవన్ కళ్యాణ్ నన్నేం పీకుతారని అనుకోని క్షమాపణలు చెప్పడం లేదు, కనీసం స్పందించడం కూడా లేదు
వేరే నియోజకవర్గ ఎమ్మెల్యేలకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటే… https://t.co/5ZeMuStocw pic.twitter.com/UtcVJY86Cu
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2025