Jackie Shroff | ఇండియా (India) పేరును భారత్ (Bharat)గా మారుస్తారన్న ప్రచారం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ స్పందించారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ప్లానెట్ ఇండియా ప్రచారానికి జాకీ ష్రాఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ ఈవెంట్లో మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా.. ఇండియా ఇప్పుడు భారత్‌గా పేరు మారబోతుంది. దీనిపై ఏమంటారు అని జాకీని అడుగగా.. జాకీ ష్రాఫ్ స్పందిస్తూ..
“ఇండియాను భారత్ అని పిలిస్తే తప్పు లేదు. నా పేరు జాకీ ష్రాఫ్ (Jackie Shroff), చాలామంది నన్ను జాకీ (Jackie) అని పిలుస్తారు, కానీ కొందరు నన్ను జాకీ (Jockey) అని పిలుస్తారు. ప్రజలు తరచుగా నా పేరును వక్రీకరిస్తారు. కానీ నేను మారలేదు. మనం ఎలా మారతాం? పేరు మారవచ్చు.. మనం కాదు” అంటూ జాకీ ష్రాఫ్ సమాధానమిచ్చాడు.
#WATCH | On G20 Summit dinner invitations at Rashtrapati Bhawan sent in the name of ‘President of Bharat’, Actor Jackie Shroff says, “If Bharat is being called Bharat, it is not a bad thing…we won’t change even if the name is changed” (05/09) pic.twitter.com/PTzHE1I3Sa
— ANI (@ANI) September 5, 2023