సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాక్ – కొంచెం క్రాక్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. వైష్ణవి చైతన్య కథానాయిక. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ చిత్ర యూనిట్ ఏపీలోని భీమవరం విష్ణు కాలేజ్లో సందడి చేసింది. యూత్ ఓ రేంజ్లో ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని, అందరికీ తప్పక నచ్చుతుందని, స్టూడెంట్స్ అంతా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయాలని హీరోహీరోయిన్లు సిద్ధు, వైష్ణవి కోరారు. ‘జాక్’ సినిమా అద్భుతంగా వచ్చిందని, సిద్ధును హీరోగా మరోస్థాయిలో నిలబెట్టే సినిమా అవుతుందని నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అన్నారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.