Auto Ramprasad | ఆటో రాంప్రసాద్‌కు క్యాన్సర్ అని ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన జబర్దస్త్ కమెడియన్
Auto Ramprasad | జబర్దస్ స్టేజి మీద, బయట ఎక్కడకు వెళ్లినా తలకు క్యాప్ పెట్టుకుని కనిపించడంతో ఆటో రాంప్రసాద్‌కు క్యాన్సర్ అని ప్రచారం మొదలైంది. ఈ వార్తలపై తాజాగా రాంప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు.
Auto Ramprasad | జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్ ఆరోగ్యంపై ఇటీవల రకరకాల కథనాలు వస్తున్నాయి. గాలోడు సినిమా సక్సెస్ తర్వాత సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురూ కలిసి ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో రాంప్రసాద్ తలకు క్యాప్ పెట్టుకుని కనిపించాడు. అప్పట్నుంచి రాంప్రసాద్‌కు ఏమైందనే అనుమానం అభిమానుల్లో మొదలైంది. పైగా జబర్దస్ స్టేజి మీద, బయట ఎక్కడకు వెళ్లినా తలకు క్యాప్ పెట్టుకుని కనిపించడంతో ఇవి మరింత ఎక్కువయ్యాయి. బ్రెయిన్ ట్యూమర్ కారణంగా రాంప్రసాద్ తలకు సర్జరీ జరిగిందని ప్రచారం జరిగింది.. ఆ తర్వాత రాంప్రసాద్‌కు క్యాన్సర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లు మరింత ఎక్కువ కావడంతో రాంప్రసాద్ స్పందించాడు. తన అనారోగ్యంపై వస్తున్న వదంతుల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టాడు.

తనకు క్యాన్సర్ ఉందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆటో రాంప్రసాద్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశాడు. తలకు క్యాప్ పెట్టుకుని కనిపించేసరికి అందరూ నాకేమైపోయిందో అని కంగారు పడుతున్నారు. క్యాన్సర్ అని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని అన్నాడు. కొద్దిరోజుల క్రితం హెయిర్ ప్లాంటేషన్ చేయించుకున్నానని చెప్పాడు. అందుకే క్యాప్ పెట్టుకుని తిరుగుతున్నా తప్ప.. అంతకుమించి ఏ ఆరోగ్య సమస్యా లేదని క్లారిటీ ఇచ్చారు. నాకేదైనా అయితే మీరు ఉన్నారుగా చూసుకోవడానికి అంటూ చెప్పుకొచ్చాడు. దయచేసి అసత్య వార్తలు రాయకండి అంటూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

