Jabardast Naresh | బుల్లితెర ప్రేక్షకులకి జబర్ధస్త్ నరేష్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనదైన హాస్యంతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించే నరేష్ ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు జబర్ధస్త్లోను సందడి చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు జబర్ధస్త్ నరేష్ పెళ్లి హంగామా శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్లో నెలకొంది. ఈ సారి స్టేజ్‌పై మళ్లీ పెళ్లి సందడి కనిపించింది. గతంలో రష్మీ–సుధీర్ల ‘పెళ్లి’ ఎపిసోడ్ ఎంత హల్చల్ చేసిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి మరో సీన్ ఈసారి కమెడియన్ నరేష్ చుట్టూ తిరిగింది.
హైపర్ ఆది ఒక అద్భుతమైన ట్విస్ట్ ఇస్తూ..“మా అందరికీ ఒక ఫ్యామిలీ నుంచి మెసేజ్ వచ్చింది. నరేష్‌ని చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వాళ్లు కూడా ఇక్కడికే వచ్చారు!” అని ప్రకటించగానే స్టేజ్ మొత్తం సందడిగా మారింది. వెంటనే ఆ అమ్మాయిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి, లైవ్ పెళ్లి చూపుల కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి పేరు నవ్య కాగా, నరేష్-నవ్యల పేర్లు భలే కలిసాయని హైపర్ ఆది కామెడీ చేశారు. ఇక ఆ అమ్మాయి నరేష్ వైపు తిరిగి, “నువ్వంటే నాకు చాలా ఇష్టం… లవ్ యూ ఫరెవర్!” అంటూ ప్రపోజ్ చేయగా, సిగ్గుతో నవ్విన నరేష్ కూడా “నాకూ మీరు బాగా నచ్చారు” అంటూ రిప్లై ఇచ్చాడు.
ఈ సరదా క్షణంలో అన్నపూర్ణమ్మ కూడా జోక్యం చేసుకుని ..“డిగ్రీ పాస్ అయిన తర్వాత ఉద్యోగానికి వెళ్తావా?” అని అడగగా, ఆ అమ్మాయి చమత్కారంగా “నరేష్‌కి ఏది ఇష్టమైతే, అదే నాకూ ఇష్టం!” అంటూ బదులిచ్చింది. ఈ సరదా సీన్లో నరేష్ తండ్రి మాత్రం ఎమోషనల్ అయ్యారు. “నా కొడుక్కి పెళ్లి అవుతుందో లేదో అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ సీన్ చూసి నిజంగా ఆనందంగా ఉంది” అని చెప్పడంతో స్టేజ్‌పై హాస్యానికి తోడు హృదయాన్ని తాకే ఎమోషన్ కూడా తోడైంది. మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఎపిసోడ్ నరేష్ జీవితంలో గుర్తుండిపోయే రోజు అయింది. అయితే ఇవి కేవలం సరదా పెళ్లి చూపులా? లేక నిజంగానే పెళ్లి ప్లాన్ జరుగుతోందా? అన్నది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాలి!