Jaane Jaan Teaser | బాలీవుడ్ హీరోయిన్లలో కరీనా కపూర్ (Kareena Kapoor)కి ఒక సెపరేట్ స్టార్డమ్ ఉంది. భజరంగీ భాయిజాన్ (Bajarangi Bhaijaan), త్రీ ఇడియట్స్ (3 Idiots), జబ్ వి మెట్ (Jab We Met), కభీ ఖుషి కభీ ఘం, బాడీగార్డ్ (Bodyguard) చిత్రాలతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది కరీనా. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందిన ఈ బెబో.. సైఫ్ అలీఖాన్‌తో వివాహం అనంతరం సినిమాలు తగ్గించింది. ఇక కరీనా నటించిన చివరి చిత్రం లాల్ సింగ్ చద్దా. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. చాలా కాలం తర్వాత కరీనా కపూర్ చేస్తున్న చిత్రం జానే జాన్ (Jaane Jaan). కరీనా కపూర్‌కు ఫస్ట్ ఓటీటీ డెబ్యూగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా షార్ట్ టీజర్ (Short Teaser)ను వదిలారు.
థ్రిల్లర్ జానర్లో రానున్నట్లు ఈ షార్ట్ టీజర్ చూస్తే తెలుస్తుంది. ఒక గదిలో కరీనా కపూర్ జానే జాన్ అనే పాట పాడుతుండగా.. పాతల్ లోక్ ఫేమ్ (Paatal Lok Fame) జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat), విజయ్ వర్మ (Vijay Verma) పాత్రలు కనిపిస్తాయి. కాగా.. ప్రస్తుతం ఈ టీజర్ వైరల్ అవుతుంది.
Jaane Jaan is coming ✨ on our very own Jaane Jaan’s birthday too ❤️
Mark your calendars for a present like no other! #JaaneJaan arrives September 21st, only on Netflix. pic.twitter.com/Xppuk9W1Kw
— Netflix India (@NetflixIndia) August 25, 2023
ప్రముఖ జపనీస్ రచయిత కెఇగో హైగాశినో (Kiego Higashino)రాసిన ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్ (The Devotion of Suspect X) నవల ఆధారంగా వస్తున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుజయ్ ఘోష్ (Sujoy Ghosh) దర్శకత్వం వహిస్తున్నాడు. కరీనా కపూర్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 21న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది.