Tiger Nageswara Rao | టైగర్ నాగేశ్వర రావు మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ.. రవితేజ టీం క్రేజీ న్యూస్
Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). వంశీ (Vamsee) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో నుపుర్ సనన్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.
Tiger Nageswara Rao | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వర రావు (Tiger Nageswara Rao). వంశీ (Vamsee) డైరెక్ట్ చేస్తున్నాడు. 1970స్ కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్ రావు జీవిత కథగా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతిసనన్ సోదరి నుపుర్ సనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాతో నుపుర్ సనన్ టాలీవుడ్ డెబ్యూ ఇస్తోంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.
రేపు ఉదయం 11:07 గంటలకు ఫస్ట్ సింగిల్‌ను లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. సారాపై టైగర్ ప్రేమ.. అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్ అని తెలుస్తోండగా.. రేపు దీనిపై క్లారిటీ రానుందన్నమాట. నుపుర్ సనన్ ఇందులో సారా పాత్రలో నటిస్తోండగా. . ట్రైన్లో నుంచి తన ప్రియుడి కోసం చూస్తున్నట్టుగా ఉన్న లుక్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు గ్లింప్స్‌లో గూస్ బంప్స్ తెప్పించే రవితేజ విజువల్స్ నెట్టింట వైరల్ అవుతూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్ మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఈ చిత్రంలో సీనియర్ నటి రేణూదేశాయ్ హేమలత లవణం పాత్ర పోషిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ దర్శకనిర్మాత, నటుడు అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనుపమ్ ఖేర్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి రాఘవేంద్ర రాజ్‌పుత్‌గా, మురళీ శర్మ విశ్వనాథ శాస్త్రిగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. టైగర్ నాగేశ్వర రావు అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ..
FEROCIOUS TIGER’S playful side for his LOVE ✨🥁#TigerNageswaraRao First Single announcement tomorrow at 11:07 AM 🥷⏳
WORLDWIDE HUNT in cinemas from October 20th 🐯🔥@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @gvprakash @MayankOfficl @ArchanaOfficl… pic.twitter.com/wremDRo2GS
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 31, 2023
టైగర్ నాగేశ్వరరావు టీజర్..
సారా ఇంప్రెసివ్ లుక్..
#TigerNageswaraRao pic.twitter.com/irmTLvmJhJ
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 28, 2023
అనుపమ్ ఖేర్ న్యూ లుక్..
You have been our lucky charm sir!
Thank you for being a special part in #TheKashmirFiles and #Karthikeya2 ❤#TigerNageswaraRao will be another special film in our collaboration. https://t.co/4o7qzQW944
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 14, 2023
మురళీ శర్మ న్యూ లుక్..
Introducing the versatile #MuraliSharma as ‘Viswanath Sastry’ from #TigerNageswaraRao ❤️🔥
GET READY FOR TIGER’S INVASION ON AUGUST 17th 🐅@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @AnupamPKher #RenuDesai @NupurSanon @gaya3bh @Jisshusengupta @gvprakash @madhie1 @artkolla… pic.twitter.com/jt62TSDGID
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 15, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

