టాలీవుడ్ యాక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ఎన్బీకే 108 (NBK 108). నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మేకర్స్ భారీ ప్రకటనతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సాయంత్రం 4:28 గంటలకు ఎన్బీకే 108 సెన్సేషనల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం.
తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై భారీ టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కనుంది. అఖండ తర్వాత ఎస్ థమన్ ఈ చిత్రానికి మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నాడు. ఇదిలా ఉంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఎన్బీకే 107 చేస్తుండగా..షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో కోలీవుడ్ భామ శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలై గ్లింఫ్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ఈ ప్రాజెక్టులో పెళ్లి సందD ఫేం శ్రీలీల బాలకృష్ణ కూతురిగా నటిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఈ ప్రాజెక్టు పూర్తవగానే అనిల్ రావిపూడి సినిమాతో బిజీ కానున్నాడు బాలకృష్ణ.
Read Also : Kajal Kattappa look | కట్టప్పగా మారిన కాజల్ అగర్వాల్..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : RT Teamworks | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రవితేజ నెక్ట్స్ సినిమా..!
Read Also : Vishal | సినిమా షూటింగ్లో గాయపడ్డ హీరో విశాల్..!