బాహుబలి ప్రాంఛైజీలో అత్యంత కీలకంగా ఉండే పాత్ర కట్టప్ప. బాహుబలి, శివగామి పాత్రల తర్వాత మళ్లీ ఆ రేంజ్లో ఫేమస్ అయ్యాడు సిల్వర్ స్క్రీన్ కట్టప్ప. ఈ పాత్రకు సత్యరాజ్ ప్రాణం పోశాడనే చెప్పాలి. చిన్ననాటి బాహుబలి పాదాన్ని నెత్తిన పెట్టుకున్న స్టిల్ ఏ రేంజ్లో ఫేమస్స్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చాలా కాలం తర్వాత ఆ కట్టప్పను గుర్తు చేస్తూ ఇపుడు లేడీ కట్టప్ప వచ్చేసింది.
అదేంటి..ఇంతకీ ఆ లేడీ కట్టప్ప ఎవరనుకుంటున్నారా..టాలీవుడ్ కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఈ భామ బాహుబలి సీన్‌ను రీక్రియేట్ చేస్తూ కొడుకు నీల్ (Neil) పాదాన్ని నెత్తిన పెట్టుకుని కెమెరాతో క్లిక్ మనిపించింది. ఈ ఫొటోను నెట్టింట పోస్ట్ చేస్తూ..ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) సార్, నీల్, నేను కలిసి మీకు డెడికేషన్ చేస్తున్నాం..అంటూ క్యాష్షన్ ఇచ్చింది. ఇపుడీ ఫొటో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఫొటోను తమన్నా తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది.
కాజల్ త్వరలోనే శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో రాబోతున్న ఇండియన్ 2లో మెరవనుంది. ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కాగా..మిగిలిన పార్టును షూట్ చేయనున్నారు. దీంతోపాటు పలు సినిమాలు కూడా చేస్తోంది కాజల్.