టాలీవుడ్ (Tollywood)స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun)ప్రస్తుతం పుష్ప (Pushpa )సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్నిసుకుమార్ (Sukumar) డైరెక్ట్ చేస్తున్నాడు. డిసెంబర్ 17న థియేటర్లలో సందడి చేయనుండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది పుష్ప టీం. ఆదివారం బన్నీ డబ్బింగ్ (Tollywood)చెప్పేందుకు స్టూడియోకు వచ్చిన వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. బన్నీ ఫుల్ టీ షీర్ట్, బ్లాక్ ప్యాంట్లో స్టైలిస్ గాగుల్స్ పెట్టుకుని నయా లుక్లో కనిపిస్తూ సందడి చేస్తున్న వీడియోను మేకర్స్ సోషల్మీడియాలో షేర్ చేశారు. పుష్ప కోసం డబ్బింగ్ చెప్పేందుకు బన్నీ రాగా..అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్ మనిపించాయి.
మొత్తానికి పుష్పరాజ్ చాలా కాలం తర్వాత తన అభిమానులు, సినీ లవర్స్ కు వినోదాన్ని పంచేందుకు తీరిక లేకుండా కష్టపడుతున్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న పుష్ప రెండు పార్టులుగా విడుదల కానుంది. కన్నడ భామ రష్మిక మందన్నా(Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియుల్ని తెగ ఆకట్టుకుంటున్నాయి.
The Dubbing formalities of #PushpaTheRise in full swing 🔥#PushpaRaj will thrill you on screens with his language and body language #ThaggedheLe 🤙#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @MythriOfficial pic.twitter.com/S1mcVxR1Al
— BA Raju's Team (@baraju_SuperHit) November 21, 2021
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ముత్తమ్ శెట్టి మీడియాతో అసోసియేట్ అవుతూ0 నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మంగళం శ్రీను పాత్రలో సునీల్ నటిస్తున్నాడు. దాక్షాయణి పాత్రలో అనసూయ నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
TJ Gnanavel Apology | క్షమాపణలు చెప్పిన జైభీమ్ డైరెక్టర్..!
Karthikeya Lohita marriage | గ్రాండ్గా హీరో కార్తికేయ వివాహం..పెళ్లి వేడుక వీడియో
Akhanda New Poster Update | బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ షికారు..కొత్త పోస్టర్ అదిరింది
Pooja Hegde Beach video | సాగరతీరాన బికినీలో పూజా హెగ్డే అందాల విందు..వీడియో వైరల్