Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు రెండోసారి తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. తల్లీబిడ్డలు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు.
అయితే ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పెషల్ ఫొటోను షేర్ చేశారు. తన భార్య ఉపాసన, పెంపుడు కుక్కలతో కలిసి ఉన్న అందమైన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌ను పంచుకుంటూ, తమ జీవితంలోకి కొత్త అతిథులు రావడం పట్ల ఎమోషనల్ అయ్యారు. క్లింకారతో కలిపి ఇప్పుడు ముగ్గురు పిల్లల తండ్రి అయినందుకు చాలా కృతజ్ఞతగా ఉందని, తమ జీవితంలో మహిళలే గొప్ప బలమని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.