Itlu Maredumilli Prajaneekam Movie | కామెడీ కింగ్ అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత ‘నాంది’తో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. గత కొంత కాలంగా కామెడీ సినిమాలను చేసుకుంటూ వస్తున్న నరేష్.. ‘నేను’ చిత్రం తర్వాత పూర్తి స్థాయి సీరియస్ పాత్రలో ఈ చిత్రంలో నటించి గొప్ప ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్గానూ భారీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే ‘ఇట్లు మారేడు మిల్లి నియోజకవర్గం’ అనే కంటెంట్ ఒరియెంట్ మూవీని చేస్తున్నాడు. ఏ.ఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు.
మంగళవారం ఈ చిత్రంలోని ‘లచ్చిమి’ అనే సాంగ్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ పాటను నితిన్ విడుదల చేయనున్నాడట. ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఎలక్షన్ అధికారికగా కనిపించనున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా నరేష్ మరోసారి సీరియస్ రోల్లో మెప్పించనున్నాడు. ఈ చిత్రాన్ని జీ స్టూడీయోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అల్లరి నరేష్‌కు జోడీగా శ్రీదేవి సోడాసెంటర్ ఫేం ఆనంది హీరోయిన్గా నటించింది.