మూడు తరాలు.. నాలుగు పాత్రలు?
పానిండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 800కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.
పానిండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 800కోట్ల భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది. ఈ సినిమాలో తాత, తండ్రి, ఇద్దరు కొడుకులుగా అల్లు అర్జున్ నటిస్తున్నారట. నిజానికి ఇద్దరు కొడుకుల పాత్రలకు మాత్రమే బన్నీని అనుకున్నారట అట్లీ. తాత, తండ్రి పాత్రలను వేరే నటులతో చేయించాలని ఆయన భావించారట. కానీ ఆ పాత్రల తీరుతెన్నులు నచ్చడంతో తానే చేస్తానని బన్నీ పట్టుబట్టారట. బన్నీ కోరిక మేరకు లుక్ టెస్ట్ నిర్వహించి, సంతృప్తికరంగా అనిపించడంతో అట్లీ ఓకే చేశారట. బన్నీ ఈ సినిమాలో నాలుగు పాత్రలు పోషించడం సినిమాకు కూడా ప్లస్ అవుతుందనేది చిత్రబృందం అభిప్రాయం కూడా. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్నది. 2027 డిసెంబర్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. దీపిక పదుకొన్ ఇందులో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

