చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన తేజ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూపర్ హిట్ సాధించాడు. ఇప్పుడు ”ఇష్క్” సినిమాతో ప్రేక్షకులని పలకరించేందుకు సిద్దమయ్యాడు. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది చిత్రానికి ఉపశీర్షిక కాగా ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా నటిస్తుంది. సౌత్ ఇండియాలోని పెద్ద బ్యానర్లలో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ కొంత విరామం తర్వాత మళ్ళీ తెలుగులో నిర్మిస్తున్న సినిమా ఇది కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
ఆర్.బి.చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్ , పారస్ జైన్,వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ‘టక్ జగదీష్’ ‘తలైవి’ వంటి సినిమాల విడుదల వాయిదా పడటంతో ఇష్క్ మూవీని ఏప్రిల్ 23న విడుదల చేస్తున్నట్టు ఉగాది సందర్భంగా ప్రకటించారు.ఇక తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఇందులోని సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. హీరో, హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. చిత్రానికి మహతి స్వరసాగర్ బాణీలు సమకూరుస్తుండగా.. లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందిస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. వరప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.
This looks very interesting!👌🏻
— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 15, 2021
Here's, the Trailer of #ISHQ, Not a Love Story
▶️https://t.co/RMg4pX4k0C
My best wishes to @tejasajja123 & the whole team! 🤗#ISHQFromApril23rd#PriyaPVarrier #SSRaju @mahathi_sagar #RBChoudary @ProducerNVP #ParasJain @adityamusic #IshqTrailer pic.twitter.com/Stu4YiKpUR