Tollywood Box Office | టికెట్ రేట్స్ ఇష్యూ అన్నారు..మరి తగ్గాక బ్లాక్ బస్టర్ రాలేదెందుకు..?
పెద్ద సినిమాలకు అడ్డు అదుపు లేకుండా టికెట్ రేట్లు (Ticket Rates) పెంచారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటికి ఫలితాలు కూడా అంతే దారుణంగా రావడంతో.. నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే థియేటర్స్ కు జనం రావడం లేదు అనుకున్నారంతా.
తెలుగు ఇండస్ట్రీ (Telugu Industry)లో కొన్ని రోజులుగా పెరిగిన టికెట్ రేట్ల గురించి ఎంత చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా పెద్ద సినిమాలకు అడ్డు అదుపు లేకుండా టికెట్ రేట్లు (Ticket Rates) పెంచారంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటికి ఫలితాలు కూడా అంతే దారుణంగా రావడంతో.. నిజంగానే టికెట్ రేట్లు పెరగడం వల్లే థియేటర్స్ కు జనం రావడం లేదు అనుకున్నారంతా. కానీ అందులో ఎలాంటి నిజం లేదని.. టికెట్ రేట్లు కాస్త ప్రభావం చూపించినా కూడా కంటెంట్ లేని సినిమాలను చూడడానికి ఆడియన్స్ అసలు ఆసక్తి చూపించడం లేదనే విషయం గత కొన్ని రోజులుగా వస్తున్న సినిమాలను బట్టి చూస్తుంటే అర్థమవుతుంది.
జూన్ మొదటి వారంలో మేజర్ (Major), విక్రమ్ (Vikram) సినిమాలు వచ్చి అద్భుతమైన విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ టికెట్ రేట్లతో వచ్చాయి. దానికి తోడు సినిమాలో కంటెంట్ కూడా చాలా బలంగా ఉంది. దాంతో రెండు సినిమాలు సంచలన విజయం సాధించాయి. కానీ ఆ తర్వాత వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ రిజల్ట్ అందుకోలేదు.
భారీ అంచనాలతో వచ్చిన నాని అంటే సుందరానికి, రానా విరాటపర్వం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచాయి. ఒక్కో సినిమా కనీసం 10 కోట్లకు పైగా నష్టాలు తీసుకొచ్చింది. మరోవైపు మొన్న జూలై 1న గోపీచంద్ హీరోగా మారుతి తెరకెక్కించిన పక్కా కమర్షియల్ సినిమాకు కూడా చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. పైగా పరమ రొటీన్ కథతో మారుతి తెరకెక్కించిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. ఇన్ని రోజులు టికెట్ రేట్ల కారణంగానే థియేటర్స్ కు జనం రావడం లేదని చెప్పుకున్న వాళ్లకు నెల రోజులుగా వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి.
టికెట్ రేట్లు 200 లోపే ఉన్నా కూడా ఎందుకు బ్లాక్ బస్టర్ సినిమాలు రావడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. దీనికి కారణం కంటెంట్ లేని సినిమాలని స్పష్టంగా తెలుస్తోంది. కథలో నిజంగా దమ్ముంటే.. ఒకవేళ టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా థియేటర్స్ కు వచ్చే జనం చూస్తారు అని కొన్ని సినిమాలు ఇప్పటికే నిరూపించాయి. తక్కువ టికెట్ రేట్లు ఉన్నా కూడా సినిమాలో విషయం లేకపోతే థియేటర్స్ వైపు కన్నెత్తి కూడా చూడం అంటూ ఇప్పటికే చాలాసార్లు నిరూపించారు ప్రేక్షకులు.
ఏదేమైనా కూడా కరోనా తర్వాత ప్రేక్షకులు చాలా మారిపోయారు. వాళ్లను థియేటర్స్ కి రప్పించాలి అంటే ఏదైనా అద్భుతం చేయాలి. అది చేయడంలో విఫలమవుతున్నారు మన దర్శకులు. ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ జూలైలో రాబోయే ది వారియర్, థాంక్యూ, కార్తికేయ 2, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలపైనే ఉన్నాయి.
Read Also : Lavanya Tripathi Interview | ‘హ్యాపీ బర్త్ డే’ చాలా ఎక్జయిటింగ్‌గా ఉంటుంది..లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ
Read Also : RK Roja Selfie | ప్రధాని మోదీ, చిరంజీవితో మంత్రి రోజా సెల్ఫీలు..ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Also : Malaika Arora | జిమ్ సెంటర్ వద్ద ఫిట్నెస్ క్వీన్ మలైకా..ట్రెండింగ్‌లో వీడియో
Read Also : Puri Jagannath | పూరీ ఇంతకీ న్యూడ్ పోస్టర్‌ను ఎందుకు రిలీజ్ చేశాడో..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

