Thalapathy Vijay-Atlee Combo | ఇండస్ట్రీలో కొన్ని కాంబోలుంటాయి. ఆ కాంబోలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో అట్లీ- విజయ్ కాంబో ఒకటి. వీళ్ళిద్ధరి కలయికలో సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్‌బస్టర్ అని తమిళంలో అంటుంటారు. ఇప్పటికే వీళ్ల కాంబోలో తెరకెక్కిన తేరీ, మెర్సల్, బిగిల్ ఒకదానికి మించి మరొకటి ఘన విజయం సాధించాయి. దాంతో వీళ్ల కాంబోలో సినిమా సెట్టయిందంటే బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షమే అని భావిస్తుంటురు. ఇక ఇప్పుడు విజయ్, లోకేష్ సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు అట్లీ షారుఖ్‌తో జవాన్ చేస్తున్నాడు. అయితే వీరిద్ధరి కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కుతున్నట్లు తమిళ వర్గాల సమాచారం.
విజయ్ తన తదుపరి సినిమాను అట్లీతో చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే అట్లీ చెప్పిన కథ విజయ్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేశాడట. పైగా వీళ్లద్ధరి బ్లాక్‌బస్టర్ కాంబో. అంతకుమించి విజయ్ మార్కెట్‌ను రెండింతలు చేసింది కూడా అట్లీనే. మెర్సల్ నుండి విజయ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఇక లోకేష్‌తో సినిమా పూర్తవ్వగా విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తుంది. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం విజయ్ వారసుడు సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకుగా రిలీజైన ఈ సినిమా పండగను బాగానే క్యాష్ చేసుకుంది. ఇక విజయ్ నటిస్తున్న దళపతి67 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం లోకేష్ అన్ని భాషల నుండి స్టార్ యాక్టర్లను తీసుకుంటున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని విజయ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.