Sreeleela | ఇప్పుడంతా టాలీవుడ్లో శ్రీలీల నామమే జపం చేస్తున్నారు. తెలుగులో ఇప్పుడు రానున్న క్రేజీయెస్ట్ సినిమాలన్నింటిలో ఆమెనే కథానాయిక. వచ్చే ఏడాది వరకు చేతినిండా సినిమాలతో తెగ బిజీగా గడుపనుంది. ఇక ఇప్పుడు ఏ యంగ్ హీరోను తట్టిన శ్రీలీలనే హీరోయిన్గా కావాలని అంటున్నారట. అంత లక్కీ ఛార్మ్ అయిపోయింది ఈ కన్నడ సొగసరి. డెబ్యూ సినిమాతో బోటా బోటి మార్కులతో సరిపెట్టుకున్నా.. ధమాకాతో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటనే కాదు తన డ్యాన్స్‌లతోనూ అందరితో విజిల్స్ వేయించుకుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ పుష్ప-2 ఆఫర్‌ను తిరస్కరించిందని టాక్ నడుస్తుంది.
పుష్ప-2 సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం మేకర్స్ సంప్రదించగా శ్రీలీల సున్నితంగా వద్దని చెప్పేసిందట. దానికి కారణం కూడా లేకపోలేదు. కెరీర్ పీక్స్ స్టేజీలో ఉన్నప్పుడు ఐటెం పాట చేయడం రిస్క్ అని భావిస్తుందట. ఈ బ్యూటీ. అంతేకాకుండా ఐటెం సాంగ్ అంటే గ్లామర్ ఒలకబోయాల్సి ఉంటుంది. కానీ అది తన వల్ల కాదని నో చెప్పిందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు నెటీజన్లు సైతం పాట చేయకపోవడమే సరైన నిర్ణయం అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఆ మధ్య త్రివిక్రమ్ డైరెక్షన్లో బన్నీ, శ్రీలీల కలిసి ఓ యాడ్ చేశారు. యాడ్ చూసిన వాళ్లకు వీళ్ల పేయిర్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. భవిష్యత్తులో బన్నీతో సినిమా చేసే చాన్స్ కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక శ్రీలీల చేతిలో ప్రస్తుతం అరడజను సినిమాలకు పైగానే ఉన్నాయి. అందులో పెద్దది అంటే గుంటూరు కారం అనే చెప్పాలి. ఈ సినిమా గనుక క్లిక్ అయితే శ్రీలీల రేంజే మారిపోతుంది.