Agent Movie Pre-Release Event | సరిగ్గా ఐదు రోజుల్లో అఖిల్ ఏజెంట్‌తో సందడి చేయబోతున్నాడు. దసరా తర్వాత కాస్త చప్పగా సాగిన ఈ వారం విరూపాక్షతో ఏప్రిల్‌నెలకు కాస్త కల వచ్చింది. అయితే అది థ్రిల్లర్ కావడంతో మాస్ ప్రేక్షకులకు అంతగా రుచించదు. ఇక ఇప్పుడు ఫ్యామిలీ,యూత్ ఆడియెన్స్‌తో పాటు మాస్ ఫ్యాన్స్ కూడా ఏజెంట్ సినిమా గురించి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మెషన్ చూస్తుంటేనే ఈ సినిమాతో భారీ రేంజ్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడని తెలుస్తుంది. దానికి తోడు ఇటీవల రిలీజైన ట్రైలర్ రచ్చ లేపింది. అక్కినేని ఫ్యాన్స్‌కు అసలైన పండుగ ఏప్రిల్ 28నేనని గుర్తు చేసింది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో అఖిల్ అలుపెరగకుండా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. కేవలం కాకినాడలో పోస్టర్ లాంచ్ కోసమే 172 అడుగుల నుంచి తాళ్ల కట్టుకుని దూకాడంటే ఈ సినిమా కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో తెలుస్తుంది. ఇక ఇప్పుడు అందరి కళ్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఉన్నాయి. ఎలాగూ గ్రాండ్ లెవల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తారని తెలిసిందే. అయితే ఈవెంట్‌కు ఎవరని గెస్ట్‌గా పిలుస్తారనేది ప్రశ్నగా మారింది. కొడుకు కాబట్టి నాగార్జున ఎలాగైనా వస్తాడు. తమ్ముడి సినిమా కాబట్టి నాగచైతన్య కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే వీరిద్దరిని గెస్ట్‌లు అనలేం.
కాగా తాజాగా సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రానున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఇక ఇందులో నిజమెంతుందో కానీ ప్రభాస్ వస్తే మాత్రం ఏజెంట్‌పై హైప్ మాములుగా పెరగదు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించాడు. ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య నటిస్తుంది.