Pawan Kalyan | మరో ఫ్లాప్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?
Pawan Kalyan | ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నంత బిజీగా టాలీవుడ్లో ఏ నటుడు లేడేమో. ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఉస్తాద్‌తో పాటు, వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్లలో బిజీగా గడుపుతున్న పవన్ మరో వారం రోజుల్లో సుజీత్‌తో ఓజీ షూటింగ్ సెట్లో జాయిన్ కానున్నాడు.
Pawan Kalyan | ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నంత బిజీగా టాలీవుడ్లో ఏ నటుడు లేడేమో. ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఉస్తాద్‌తో పాటు, వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్లలో బిజీగా గడుపుతున్న పవన్ మరో వారం రోజుల్లో సుజీత్‌తో ఓజీ షూటింగ్ సెట్లో జాయిన్ కానున్నాడు. ఆ తర్వాత మళ్లీ హరిహర వీరమల్లు సెట్స్‌లోకి వెళ్లనున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న పవన్ మరో యువ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
స్వామిరారాతో మంచి ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సుధీర్ వర్మకు ఇటీవలే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. ఈ సినిమాను సితార సంస్థ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించనున్నాడు. అయితే ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందించనున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సుధీర్ వర్మ ఇటీవలే తెరకెక్కించిన రావణాసుర బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే సుధీర్ వర్మ టేకింగ్ మాత్రం బాగుందని పలువురు అభిప్రాయ పడ్డారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

