ది ఘోస్ట్ తో నాగార్జున ఆ బ్యాడ్ సెంటిమెంట్ కు బ్రేక్ చెప్తాడా..?
The Ghost Trailer Released | ఇండస్ట్రీ ఏదైనా సెంటిమెంట్ మాత్రం కామన్. కలిసి వస్తే దాన్ని వదిలిపెట్టడానికి ఏమాత్రం ఇష్టపడరు.. ఒకవేళ కలిసి రాలేదంటే మాత్రం దాని జోలికి అసలు వెళ్లరు. సినిమా ఇండస్ట్రీలో ఇది తరచూ జరుగుతుంటుంది. కానీ నాగార్జున మాత్రం దీనికి కాస్త విభిన్నం. ఆయన తనకు కలిసి రాలేదు అంటే.. ఎందుకు కలిసి రాలేదో తెలుసుకోవాలని మళ్లీమళ్లీ అదే ప్రయత్నం చేస్తుంటాడు. ది ఘోస్ట్ సినిమాతో మరోసారి అదే చేస్తున్నాడు నాగార్జున. ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా విడుదల కానుంది. అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్ కూడా విడుదలవుతుంది. ఈ రెండు సినిమాల మధ్య దసరా పోరు ఆసక్తికరంగా ఉండబోతుంది.
ఇదిలా ఉంటే తాజాగా ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌తో సినిమా కథ ఎలా ఉండబోతుందో ఒక క్లారిటీ ఇచ్చేశాడు ప్రవీణ్ సత్తారు. ఇందులో తల్లీకూతుళ్ల ప్రాణాలు కాపాడే బాడీగార్డ్‌గా కనిపిస్తున్నాడు నాగార్జున. వాళ్ళిద్దరి కోసం అవసరమైతే తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని క్యారెక్టర్ ఇది. స్పై రూపంలో వాళ్లకు నిత్యం రక్షణ కల్పిస్తూ ఉంటాడు. దుబాయ్ సహా చాలా అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను చిత్రీకరించాడు ప్రవీణ్. ఘోస్ట్ ట్రైలర్ ఆసక్తికరంగానే ఉంది.. అయితే ఈ సినిమా హిట్టు కొట్టాలంటే ముందు నాగార్జున ఒక బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేయాలి.
2007 నుంచి నాగార్జునకు మాస్ యాక్షన్ సినిమాలు పెద్దగా కలిసి రావడం లేదు. కింగ్ తర్వాత ఈయన నటించిన రగడ, భాయ్, దేవదాస్, ఆఫీసర్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయం పాలయ్యాయి. ఇందులో కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం తీసుకురాలేదు. ఎందుకో తెలియదు కానీ నాగార్జునను మాస్ హీరోగా చూడటానికి చాలామంది ప్రేక్షకులు ఇష్టపడటం లేదు. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఆయన అమ్మాయిలతో రొమాన్స్ చేస్తుంటే చూస్తున్నారు.. కానీ యాక్షన్ సినిమా చేస్తే మాత్రం అసలు ఆదరించడం లేదు. ఈ జింక్స్ బ్రేక్ చేయాలని చూస్తున్నాడు నాగార్జున. అది జరగాలంటే ది ఘోస్ట్ విజయం సాధించాలి. నాగార్జున కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. మరి ఈ సినిమాతో హిట్టు కొట్టి తనను వేధిస్తున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు బ్రేక్ చెప్తాడో లేదో చూడాలి.
Read More :
The Ghost Trailer | యాక్షన్ సీక్వెన్స్‌తో ‘ది ఘోస్ట్’ ట్రైలర్”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

