Krithi Shetty | సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచలోకి వెళ్లాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అందరికి ఆ అదృష్టం ఉండదు. ఎంత ప్రతిభ ఉన్న ఆవగింజంత అదృష్టం లేకపోతే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమే. ఒకవేళ ఎంట్రీ దొరికినా.. గుర్తింపు రావడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఇకపోతే ఇండస్ట్రీలో అవకాశం రావడమే కష్టం. అలాంటిది మొదటి సినిమాతోనే మంచి పాత్ర దొరకడం అంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అలా అదృష్టాన్ని అరచేతిలో పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చింది కృతి శెట్టి. ఉప్పెన చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ మొదటి సినిమాతోనే అందరి చూపును తన వైపు తిప్పుకుంది.
ముఖ్యంగా యూత్‌లో ఈమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌తోనే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఉప్పెన రిలీజైన ఏడాదిలోపే అరడజను సినిమాలను తన చేతిలో పెట్టుకుంది. కాగా హీరోయిన్గా వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ గతేడాది ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసింది. హీరోయిన్గా కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సెకండ్ హీరోయిన్గా చేయడంపై పలు విమర్షలు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో కృతి పోషించిన రోల్ కూడా పెద్దగా ప్రాధాన్యత లేనిదే. ఈ సినిమా తర్వాత కృతి హీరోయిన్గా చేసిన నాలుగు సినిమాలు రిలీజైయ్యాయి. వాటిలో మూడు డిజాస్టర్లు కాగా, ఒకటి ఎబో యావరేజ్‌గా నిలిచింది.
కథ, కథనాల పరంగా ఆ మూడు సినిమాలు ఫ్లాప్స్ కావచ్చు. కానీ సెకండ్ హీరోయిన్గా సినిమా చేసిన తర్వాతే అవి ఫ్లాప్ అయ్యాయి. ఎందుకంటే టాలీవుడ్ ప్రేక్షకులు.. సెకండ్ హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి.. మేయిన్ హీరోయిన్గా సినిమాలు చేస్తే చూస్తారు కానీ, మేయిన్ లీడ్‌గా సినిమాలు చేసిన హీరోయిన్ను సెకండ్ హీరోయిన్ పాత్రలో చూడలేకపోతారు. అయితే ఒకసారి పొరపాటు చేసిందిలే అని అనుకుంటుండగా ఇప్పుడు మరో సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఖుషీ’ సినిమాలో సెకండ్ హీరోయిన్గా కృతికి చాన్స్ వచ్చిందట. కృతి కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో సమంత మెయిన్ లీడ్‌లో నటిస్తుంది. సమంత నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా సమంతను డామినేట్ చేసేంతలా కృతి యాక్టింగ్ చేస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
పైగా ఇప్పుడు కృతిని ప్లాపులు వెంబటిస్తున్నాయి. ఈ క్రమంలో ఖుషీ సినిమా ఒప్పుకుంది. ఈమె పాత్ర ఏ మాత్రం తేడా కొట్టినా.. కృతికి హీరోయిన్గా అవకాశాలు రావడం కష్టంగా మారుతుంది. ప్రస్తుతం కృతి ఒక మలయాళ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. సూర్య-బాలా ప్రాజెక్ట్‌లో కూడా ఈమెనే హీరోయిన్గా ఎంపిక చేశారు. కానీ ఈ ప్రాజెక్ట్ కాన్సిల్ అయింది.