Aayirathil Oruvan 2 | తమిళ నటుడు కార్తీ నటించిన క్లాసిక్ చిత్రాలలో ‘యుగానికి ఒక్కడు’ (తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’) ఒకటి. రీసెంట్‌గానే ఈ చిత్రం తెలుగులో రీ రిలీజ్ కూడా అయ్యి మళ్లీ మంచి కలెక్షన్లు సాధించింది.
తమిళ స్టార్ దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మించారు. కార్తీ, రీమా సేన్, ఆండ్రియా జెరెమయ్యా ప్రధాన పాత్రల్లో నటించారు. చోళ సామ్రాజ్యం ఆధారంగా హిస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం 2010లో విడుదలై తమిళంతో పాటు తెలుగులో సూపర్ హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన దాదాపు 11 ఏండ్ల తర్వాత 2021లో దీనికి సీక్వెల్ ప్రకటించాడు దర్శకుడు సెల్వ రాఘవన్.
ధనుష్ హీరోగా ఈ సీక్వెల్(Aayirathil Oruvan 2)ను అయితే ప్రకటించాడు కానీ ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ప్రస్తుతం సెల్వా రాఘవన్ 7/జీ బృందావన కాలనీ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నాడు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న సెల్వ యుగానికి ఒక్కడు 2 ఆలస్యంపై స్పందించాడు.
”యుగానికి ఒక్కడు సీక్వెల్ ప్రకటించి చాలా పెద్ద తప్పు చేశాను. ఈ సినిమాపై ఉన్న బజ్‌పై చేశాను కానీ ఆ తర్వాత దాని ఎఫెక్ట్ తెలిసింది. మూవీ లవర్స్ అంతా సీక్వెల్ గురించి అప్డేట్ అడుగుతూనే ఉండేవారు. ఆ తర్వాత అర్థమైంది ఎందుకు ప్రకటించానా అని. అయితే ఈ సినిమాలో ధనుష్ హీరోగా అనుకున్నాను కానీ.. కార్తీ లేకుండా యుగానికి ఒక్కడు సినిమాను అసలు ఊహించుకోలేను. యుగానికి ఒక్కడు తెరకెక్కించాలంటే ప్రస్తుతం మంచి నిర్మాత కావాలి. అలాగే హీరో కూడా ఏడాది వరకు తన డేట్స్ మొత్తం ఈ సినిమాకే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని కుదరాలి. సీక్వెల్‌కి బడ్జెట్ ప్రాబ్లమ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు VFX ఖరీదైనవి కావు. ప్రస్తుతం కృతిమ మేధస్సు(Artificial Intelligence) రూల్ చేస్తున్న కాలంలో ఈ చిత్రాన్ని తీయడం అంత సులభం కాదంటూ” సెల్వ చెప్పుకోచ్చాడు.