Dasara Movie Second Single | ఒకప్పుడు వరుస హిట్లతో చెలరేగిపోయినా నాని.. ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. గత రెండుమూడేళ్లుగా నాని నుంచి ఆశించిన స్థాయి సినిమాలు రావడంలేదు. దాంతో నాని అభిమానులు ఆయన కంబ్యాక్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నాని కూడా తన కంఫర్ట్ జానర్ నుంచి బయటకు వచ్చి దసరా అనే అవుట్ అవుట్ మాస్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులు మెప్పు పొందడానికి ముస్తాబవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఇప్పటి నుండే ప్రమోషన్లను మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుంచి ఇటీవలే రిలీజైన టీజర్ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుకంటూనే వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ త్వరలోనే రానున్నట్లు తెలుస్తుంది. వాలైంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాలోని ఓ బ్రేకఅప్ ఆంథమ్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ధూమ్ ధామ్ దోస్తాన్ పాటకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన దసరా సినిమాలో నానికి జోడీగా కీర్తిసురేష్ నటిస్తుంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. టాలీవుడ్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం దసరా సినిమాకు అన్ని హక్కులకు కలిపి రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా బడ్జెట్ రూ.65 కోట్లు ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు ఆల్రెడీ రూ.15 కోట్ల ప్రాఫిట్లో ఉన్నట్టే. ఇక నాని మొదటి సారి ఫుల్ లెంగ్త్ ఊరమాస్ క్యారెక్టర్ చేస్తుండటంతో అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన ఆసక్తి నెలకొంది.