Bhola Shankar Movie | వాల్తేరు వీరయ్యతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం అదే జోష్ తో భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు మంచి అంచనాలే క్రియేట్ చేశాయి. దానికి తోడు చిత్రబృందం బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తు్న్నారు. తమిళంలో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. అజిత్ హీరోగా నటించిన ఈ సినిమా ఎనిమిదేళ్ల క్రితం విడుదలై తమిళంలో కోట్లు కొల్లగొట్టింది. ఇక తెలుగు నేటివిటీకి తగ్గట్లు మెహర్ రమేష్ పలు మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కాగా ఈ సినిమాను అగస్టు 11కు రిలీజ్ చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ కానున్నట్లు సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కాస్త బ్యాలెన్స్ ఉండటంతో మేకర్స్ మరో డేట్ ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్, క్రియేటీవ్ కమర్షియల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఇటీవలే రిలీజైన ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్యూన్ క్యాచీగా ఉందని, మెగాస్టార్ అదిరిపోయే స్టెప్స్ వేశాడని పలువును నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.