Jawan Movie | మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న జవాన్‌పై జనాల్లో మాములు ఎక్స్‌పెక్టెషన్స్ లేవు. ఎప్పుడూ లేని విధంగా దక్షిణాదిలో టిక్కెట్లో ఓ రేంజ్లో అమ్ముడవుతున్నాయి. అది కూడా అన్ని లోకల్ లాంగ్వేజెస్‌లో. ఈ సారి షారుఖ్ సౌత్‌లోనూ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించేలా కనిపిస్తున్నాడు. హిందీతో సహా తమిళ, తెలుగు ప్రేక్షకులు కూడా వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లే పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. అప్పుడే బాలీవుడ్ ట్రేడ్ షారుఖ్‌కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. ఇక సౌత్‌లోనూ టాక్ పాజిటీవ్‌గా వస్తే ఈజీగా రెండు, మూడొందల కోట్లు కలెక్ట్ చేస్తుందని ఫారుఖ్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ లీక్ మాత్రం ఉన్నఫలంగా అంచనాలు ఆకాశానికి ఎత్తేస్తున్నాయి. ఈ సినిమాలో ఓ క్యామియో రోల్ ఉంటుందని టాక్. అందులో తెలుగు వెర్షన్లో బన్నీ కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్. అదే విధంగా తమిళ్లో విజయ్, హిందీలో సంజయ్ దత్ కనిపించనున్నారట. ఇందులో నిజమెంతుందో తెలీదు కానీ.. ఇదే వాస్తవమైతే మట్టుకు థియేటర్‌కు వెళ్లిన ఆడియెన్స్‌కు మాములు సర్ప్రైజ్ ఉండదు. ఇప్పటికే ఈ విషయం తెలియగానే పలువురు ట్రైలర్లో ఏమైనా హింట్ ఇచ్చారా అనే అదే పనిగా రివైండ్ చేసుకుంటూ ట్రైలర్‌ను చూస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమలో షారుఖ్ తండ్రి, కొడుకులా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటిస్తుంది. దీపికా గెస్ట్ అప్పియెరెన్స్ ఇవ్వనుంది. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలన్నీ చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇక మరికొన్ని గంటల్లో ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతుంది.