Allu Arjun | రాజకీయాల్లోకి అల్లు అర్జున్ .. విజయ్ బాటలోనే ఐకాన్ స్టార్ అడుగులు వేస్తున్నాడా!
Allu Arjun | టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. సినీ రంగంలో స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న పలువురు హీరోలు రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాదరణ పొందిన నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది.
Allu Arjun | టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జోరుగా సాగుతోంది. సినీ రంగంలో స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న పలువురు హీరోలు రాజకీయాల వైపు ఆసక్తి చూపుతున్నారనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సినిమాల నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాదరణ పొందిన నాయకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం, తమిళనాడులో దళపతి విజయ్ ఏకంగా సీఎం కావడం సినీ వర్గాల్లో కొత్త చర్చలకు తెరలేపింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయ రంగప్రవేశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, బన్నీ భవిష్యత్తులో రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా తమిళనాడులో విజయ్ అనుసరించిన మోడల్‌ను అధ్యయనం చేస్తూ అదే తరహా రాజకీయ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం, అల్లు అర్జున్ ఇటీవల కొందరు ప్రముఖ రాజకీయ వ్యూహకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ భేటీల్లో భవిష్యత్తు రాజకీయ అవకాశాలు, ప్రజల్లో ప్రభావాన్ని పెంచుకునే మార్గాలు, అభిమాన సంఘాలను మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ సమావేశాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాలేదు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే.. అల్లు అర్జున్ 2034 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికను రూపొందిస్తున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెంటనే కాకుండా, ముందుగా అభిమాన సంఘాల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించి, క్రమంగా ప్రజల్లో బలమైన పునాదిని నిర్మించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అల్లు అర్జున్‌కు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అభిమాన గణం ఉంది. ‘పుష్ప’ ఫ్రాంచైజీ విజయంతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బన్నీకి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి వస్తే ఈ అభిమాన బలం ఆయనకు ప్రధాన అస్త్రంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశంపై ఇలాంటి వార్తలు అనేకసార్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ప్రతిసారి ఆయన సన్నిహిత వర్గాలు వాటిని ఖండించాయి. ప్రస్తుతం మరోసారి అదే తరహా ప్రచారం ఊపందుకోవడంతో అభిమానులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరి అల్లు అర్జున్ నిజంగానే రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నారా? లేక ఇది కేవలం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మరో రూమరేనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. అప్పటి వరకు మాత్రం ఐకాన్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా కొనసాగడం ఖాయం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- icon star
- new look
RELATED ARTICLES
తాజా వార్తలు
Sharjah | భారతీయ సిబ్బంది ఉన్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. అందరూ సురక్షితం
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

