Agent Movie Release date | అదేంటో ఒక్కోసారి ఎంత బాగా ప్లాన్ చేసిన రిలీజ్ డేట్ విషయంలో పలు మార్పులు వస్తుంటాయి. రేపో మాపో విడుదలవుతుందని అనుకునే సమయంలో పోస్ట్ పోన్ అవుతూ అందరికి షాక్ ఇస్తుంటాయి. అలా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడిని మూవీ ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు నాలుగైదు సార్లు విడుదల తేదీలో మార్పులు వచ్చాయి. గతేడాద అగస్టులో ఖచ్చితంగా వస్తుందంటూ మేకర్స్ ప్రకటించినా.. వారం రోజులు ఉందనగా పోస్ట్‌పోన్ అయింది. ఇక క్రిస్మస్కి వస్తుందంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఏవేవో కారణాలు చెప్పి అక్కినేని అభిమానులను నిరాశపరిచారు. ఇక అన్ని కుదిరితే సంక్రాంతికి పక్కా వస్తుందంటూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
కానీ సీనియర్ హీరోల పోటీని తట్టుకోలేక పక్కకు తప్పుకున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. ఆ సినిమా తర్వాత ప్రకటించిన చాలా సినిమాలు రిలీజై సూపర్ హిట్లను కూడా సాధించాయి. కానీ ఏజెంట్ మాత్రం విడుదలకు నోచుకోలేకపోతుంది. కాగా తాజాగా ఈ సినిమాకు మేకర్స్ ఒక కొత్త డేట్‌ను ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా సమ్మర్లో వినోదాన్ని పంచాలని ఫిక్సయి ఏప్రిల్ 14న ఏజెంట్‌ను విడుదల చేయాలని ఫిక్స్ చేసుకున్నారట. కాగా ముందుగా అదే డేట్‌ను భోళా శంకర్‌కు ఫిక్స్ చేశారు. కానీ భోళా శంకర్ షూటింగ్ చాలా వరకు బాకీ ఉండటంతో ఏజెంట్‌ను తీసుకువచ్చారు. ఈ రెండు సినిమాలకు నిర్మాతలు ఒక్కరు నిర్మాత.
అయితే అదే రోజున రజనీకాంత్ జైలర్ కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై తెలుగులో విపరీతమైన బజ్ ఏర్పడింది. కాబట్టి అఖిల్‌కు గట్టి పోటీ తప్పదు. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది.