e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News అశ్లీల సన్నివేశానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా భ‌క్తి గీతం.. కేసు న‌మోదు

అశ్లీల సన్నివేశానికి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా భ‌క్తి గీతం.. కేసు న‌మోదు

ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌కు కాంట్ర‌వ‌ర్సీస్‌తోనే ఫుల్ ప్ర‌మోష‌న్ ద‌క్కుతుంది. సినిమాలో ఏదో ఒక వివాద‌స్పద అంశం పెట్ట‌డం దాని ద్వారా అంద‌రి అటెన్ష‌న్ తిప్పుకోవ‌డం జ‌ర‌గుతూ వ‌స్తుంది. ఇది ఈజీ ప్ర‌మోష‌న్‌గా కొంద‌రు భావిస్తున్నారు. అయితే మ‌నోభావాల‌ను దెబ్బతీసే విధంగా కొన్ని సంఘ‌ట‌న‌లు పెట్ట‌డం, వాటి ద్వారా పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కు వెళ్లి వార్త‌లలోకి ఎక్క‌డం జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.

తాజాగా ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ సినిమా నిర్మాత, దర్శకుడిపై సిటీ సైబర్‌క్రైమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సినిమా ట్రైలర్ హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉందని ఆన్‌లైన్‌లో ఈ సినిమాపై ఫిర్యాదు చేసారు. 67 IT యాక్ట్, 295 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు పోలీసులు. ట్రైలర్‌లో అశ్లీల సన్నివేశానికి ఓ భక్తి గీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా జోడించడంపై హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి .

- Advertisement -

‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రాన్ని కొత్త దర్శకుడు యుగంధర్ తెరకెక్కించాడు. ఆగస్ట్ 6న సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులో శృంగార సన్నివేశాలు వస్తున్నపుడు భజగోవిందం అనే బ్యాగ్రౌండ్ స్కోర్ వాడుకున్నారు. దాంతో ఇదే కాంట్రవర్సీకి కేంద్రబిందువు అయింది. దీనిపై దర్శకుడు యుగంధర్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాడు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement