Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 15వ రోజు భావోద్వేగాలు, రొమాన్స్, వాదోపవాదాలు నడిచాయి. ఎపిసోడ్ ప్రారంభంలో ఫ్లోరా షైనీ జైల్లో కనిపించగా, రీతూ చౌదరి ఎవరూ తనతో మాట్లాడడం లేదని ఏడ్చేసింది. ఈ క్రమంలో కళ్యాణ్ ఆమెను ఓదార్చగా, ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాన్స్ కూడా చోటుచేసుకుంది. బిగ్ బాస్ ఆదేశాల మేరకు టెనెంట్స్ ముందుగా నామినేషన్స్ చేపట్టారు. ఐదుగురి పేర్లు ఏకాభిప్రాయంతో నిర్ణయించాలి, వారిలో ఒకరు టెనెంట్ కావాలి. ఈ క్రమంలో టెనెంట్స్ సంజన, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ ను నామినేట్ చేశారు. టెనెంట్స్ నుండి ఒకరిని ఇవ్వాలనడంతో హరీష్ పేరు జాబితాలో చేరింది.
ఈ నిర్ణయంపై హరీష్ అసహనం వ్యక్తం చేసి, డీమాన్ పవన్‌తో వాగ్వాదానికి దిగాడు. “నీకు రీతూ విషయంలో కళ్ళు మూసుకుపోయాయి” అంటూ హరీష్ పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆమెకి నువ్వు ఫేవర్ గా ఉంటున్నావు. ఆమె చేసిన తప్పులు నీకు ఏ మాత్రం కనిపించడం లేదు. నీలాగా నేను లత్కోర్ పనులు చేయను అంటూ హరీష్ రెచ్చిపోయి కామెంట్స్ చేశాడు. మొత్తంగా టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, హరీష్ ఉన్నారు. తర్వాత ఓనర్స్కు స్వాప్ అవకాశం ఇచ్చారు. టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో సంజన, సుమన్ శెట్టి స్థానంలో కళ్యాణ్, ప్రియా పేర్లను చేర్చారు.
ఇమ్మాన్యుయేల్ వివరణ ఇస్తూ..కళ్యాణ్ గేమ్‌లో యాక్టివ్‌గా లేడని, ప్రియా మాట్లాడే తీరు అందరికీ నచ్చడం లేదని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రియాను తీవ్రంగా బాధపెట్టగా, ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. తర్వాత శ్రీజ, రాము కూడా నామినేట్ అయ్యారు. అయితే కెప్టెన్ పవన్‌కు సేవ్ చేసే పవర్ ఇవ్వడంతో, ఆయన శ్రీజను రక్షించాడు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయినవారు ఎవరెవరంటే.. కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, హరీష్, రాము. మొత్తంగా, 15వ రోజు ఎపిసోడ్ భావోద్వేగాలు, నామినేషన్ టెన్షన్, వాగావాదాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.