Toxic | గతేడాది డిసెంబర్లో కన్నడ స్టా్ర్ హీరో యశ్ (Yash) టాక్సిక్ (Toxic) టైటిల్‌తో కొత్త సినిమాను ప్రకటించాడని తెలిసిందే. కేజీఎఫ్ 2 తర్వాత ఎలాంటి సినిమా ప్రకటిస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ ప్రకటనతో జోష్ ఇచ్చినట్టైంది. ఈ చిత్రాన్ని నటి కమ్ డైరెక్టర్ గీతా మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తోంది. A Fairy Tale For Grown Ups ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ (Kareena Kapoor) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే తాజాగా దీనికి సంబంధించి మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో కరీనాకపూర్ యశ్ ప్రేయసిగా కనిపించదని, అతడి సోదరి పాత్రలో కనిపించబోతుందని బీటౌన్ సర్కిల్లో వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. సోదరుడు, సోదరి మధ్య జరిగే కథాంశంతో టాక్సిస్ ఉండబోతుండగా.. పవర్ ఫుల్ రోల్లో కరీనాకపూర్‌ను తీసుకోవాలని గీతామోహన్ దాస్ చాలా ఎక్జయిటింగ్‌గా ఉందట.
ఒకవేళ ఈ కథనాలు నిజమైతే.. కరీనాకపూర్‌కు టాక్సిస్ కన్నడ డెబ్యూ సినిమా కానుందన్నమాట. మరి కరీనాకపూర్ సోదరి పాత్రలో నటిస్తే.. యశ్‌కు జోడీగా ఏ భామ కనిపించబోతుంది.. ఇంతకీ ఫీ మేల్ లీడ్ రోల్ ఉంటుందా అంటూ అప్పుడే చర్చల్లో మునిగిపోయారు మూవీ లవర్స్. మరి రానున్న రోజుల్లో ఈ డైలామాలన్నింటికి చెక్ పెట్టేలా యశ్ టీం ఏదైనా క్లారిటీ ఇస్తుందేమోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పై వెంకట్ కే నారాయణ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఏప్రిల్ 10న విడుదల కానుంది. యశ్ కెరీర్లో ఇది 19వ సినిమా.
టాక్సిక్ గ్లింప్స్ వీడియో..