Pawan kalyan – Surender Reddy Movie | పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. ఆయన 25 ఏళ్ల కెరీర్లో ఎప్పుడూ లేనంతగా వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు. ఒకదాని వెంట ఒకటి షూటింగ్ పూర్తి చేస్తూనే ఉన్నాడు. మరోవైపు దర్శకులు ఆయనకు కథలు చెబుతూనే ఉన్నారు.. పవన్ కూడా వాటికి ఓకే చెబుతున్నాడు.. ఇదంతా నిరంతర ప్రక్రియ ఎలా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ స్పీడ్ చూసి అందరూ భయపడుతున్నారు కూడా. దానికి తోడు ఆయన మినిమమ్ గ్యారెంటీగా ఉండేలా రీమేక్ సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు. తనకు ఉన్న టైం స్పేస్ లో ఎన్ని సినిమాలు వీలైతే అన్ని చేయాలని ఫిక్స్ అయిపోయాడు పవర్ స్టార్.
2024 ఎన్నికలు వచ్చే లోపు కనీసం నాలుగు సినిమాలు విడుదల చేయాలని ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. ఆ దిశగా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కమిట్ అయిన హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు పూర్తి చేయనున్నాడు. వీటితో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్లో ఉంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్‌తో ఒక మల్టీస్టారర్ చేయడానికి రెడీ అవుతున్నాడు పవన్ కల్యాణ్. ఇదిలా ఉంటే తాజాగా సురేందర్ రెడ్డి సినిమా గురించి ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.
ఈ సినిమాలో కేవలం పవన్ మాత్రమే కాదు.. మరో స్టార్ హీరో కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు రవితేజ.. తమిళంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విక్రమ్ వేద సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి.. సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. రీమేక్ మాదిరి కాకుండా గబ్బర్ సింగ్లా కేవలం లైన్ మాత్రమే తీసుకొని పూర్తిగా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని.. వక్కంతం వంశీ మరో కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మాధవన్ పాత్రలో పవన్ కళ్యాణ్.. విజయ్ సేతుపతి పాత్రలో రవితేజ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. ఒకవేళ ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే మాత్రం అభిమానులకు అంతకంటే కావాల్సింది మరొకటి లేదు. పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు రామ్ తాళ్ళూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.