బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమంలో హౌజ్‌మేట్స్ ప్రవర్తన అందరికి చిరాకు తెప్పిస్తున్నాయి. నోటికొచ్చినట్టు మాట్లాడడం,ఒకరిపై ఒకరు దూషించుకోవడం ప్రేక్షకులకి కూడా ఏ మాత్రం నచ్చడంలేదు. బిగ్ బాస్ హౌస్‌లో ఏడోవారంలో జరగుతున్న కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ రచ్చ రచ్చగా మారింది. ‘బంగారు కోడిపెట్ట’ టాస్క్ కెప్టెన్ పోటీదారుల కోసం ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విశ్వకు స్పెషల్ పవర్ ఉన్న ఒక ఎల్లో గుడ్డు లభించింది.
ఎల్లో గుడ్డుతో ఐదు గుడ్లు సంపాదించాలంటే ఎక్కువ దుస్తులు ధరించాలనే ఒక టాస్క్‌ను కూడా ఇచ్చాడు బిగ్‌బాస్. విశ్వతో పాటు ఆయన ఎంచుకున్న మరో వ్యక్తి ఈ టాస్క్ ఆడాల్సి ఉంటుంది. కాజల్‌ని ఎంచుకున్నాడు విశ్వ. ఈ టాస్క్ ఏంటంటే ఎవరు ఒంటిపై ఎక్కువ బట్టలు ధరిస్తారో వారికి బోనస్ గుడ్లు వస్తాయి. ఈ క్రమంలో సన్నీ.. కాజల్‌కి హెల్ప్ చేయగా, ఆయన ఇంట్లో ఉన్న లోదుస్తులతో సహా అన్నీ తెచ్చాడు.
ఇది చూసి ప్రియాంక ఛీ అని నవ్వేసింది. ఇక అనీ మాస్టర్ వాటిపై పంచ్‌లు వేసి తెగ నవ్వుకుంది. మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఒకదానిపై ఒకటి 106 బట్టలు వేసుకోగా.. కాజల్ 79 మాత్రమే వేసుకోగలిగింది. ఈ టాస్క్‌లో విజేతగా నిలవడంతో విశ్వకి బోనస్‌గా ఐదు గుడ్లు లభించాయి. దుస్తులని తొలగించే క్రమంలో విశ్వ ఒక్కొక్కటి విప్పుతూ వచ్చాడు. ఒంటిపై నిక్కరు తప్ప ఏమి మిగలకుండా విప్పేశాడు. అది కూడా తీసేయకపోయావా అంటూ ప్రియ పంచ్ వేసింది.