నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా ‘ఘటికాచలం’. అమర్ కామెపల్లి దర్శకుడు. ఈ చిత్రానికి కథ, నిర్మాత ఎం.సి. రాజు. శనివారం ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఓ వైపు ఆవేశంగా, మరోవైపు అమాయకంగా రెండు డిఫరెంట్ లుక్స్‌లో హీరో నిఖిల్ దేవాదుల కనిపిస్తున్నారు.
వైవిద్యమైన కథాంశంతో కూడుకున్న సినిమా ఇదని, దానికి తగ్గట్టే పోస్టర్ని డిజైన్ చేశామని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. ఈటీవీ ప్రభాకర్, అర్వికా గుప్తా, జోగినాయుడు, సంజయ్రాయ్, చుర, దుర్గాదేవి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.ఎస్.మనోజ్, సంగీతం: ప్లేవియో కుకురోలో, నిర్మాణం: ఒయాసిస్ ఎంటర్టైన్మెంట్స్.