పాపులర్ విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ హరికృష్ణను దర్శకునిగా పరిచయం చేస్తూ అభిషేక్ నామా నిర్మిస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ‘సేతు’. భారతీయ పురాణాలలో ప్రసిద్ధమైన సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథతో ఈ సినిమా రూపొందనున్నదని, రామాయణలోని యుద్ధాలు, వీరగాధలు, త్యాగాలు, ధర్మబద్ధత వంటి అంశాలు ఈ కథలో ప్రతిబింబిస్తాయని అభిషేక్ నామా తెలిపారు. పురాణగాధల స్ఫూర్తితో రూపొందించిన విలక్షణమైన పాత్రలను ఇందులో చూస్తారని ఆయన అన్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదని, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఘనంగా ఆవిష్కించే చిరస్మణీయమైన కళాఖండమని అభిషేక్ తెలిపారు.