విప్లవభావాలు, ఆధ్యాత్మికత రెండు ఉత్తరదక్షిణ ధృవాలు. ఇందులో ఒకటి ఉండే చోట రెండవది ఉండదు. కానీ.. సమంతలో రెండూ ఉండటం విశేషం. స్త్రీ స్వాతంత్య్రం, సమానత్వం గురించి బాహాటంగా మాట్లాడే సమంత.. ప్రశాంతత కోసం ఆశ్రమాలకు వెళ్లి గురు బోధలతో ఆధ్యత్మిక జీవితం గడుపుతుంటుంది. ఆ ఫొటోలను, అక్కడి అనుభవాలనూ అభిమానులకు షేర్ చేస్తుంటుంది. తను అడపాదడపా కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌కి వెళ్లి అక్కడ ధ్యానంలో గడపడం అందరికీ తెలిసిందే.
రీసెంట్గా ఆ ఫొటోలను మరోసారి అభిమానులకు షేర్ చేసింది సమంత. ‘మనల్ని సరైన మార్గంలో నడిపి, మన జీవితంలో వెలుగులు నింపే వారే నిజమైన సద్గురువు. సరైన గురువును గుర్తించడంలో స్థితప్రజ్ఞత అవసరం. రోజూవారీ జీవితంలో అనేక సంఘటనలు మనల్ని ప్రభావితం చేస్తుంటాయి. వాటిలో ఏది సాధారణమో, ఏది అసాధారణమో చెప్పడం కష్టం. అది తెలియజెప్పేది గురువే. అసలు ప్రపంచాన్ని మించిన గురువు వేరే ఉండదు. జ్ఞానం కావాలంటే ప్రపంచాన్ని వెతకాలి’ అంటూ రాసుకొచ్చింది సమంత.