Priyanka Chopra | దక్షిణాది నటితో ప్రియాంక చోప్రా సోదరుడి నిశ్చితార్థం.. ఫొటోలు షేర్ చేసిన పీసీ
Priyanka Chopra | బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra ) సోదరుడు సిద్ధార్థ్ చోప్రా (Siddharth Chopra) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
Priyanka Chopra | బాలీవుడ్ నటి, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra ) సోదరుడు సిద్ధార్థ్ చోప్రా (Siddharth Chopra) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. దక్షిణాది నటి నీలం ఉపాధ్యాయ (Neelam Upadhyaya)ను సిద్ధార్థ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇందులో భాగంగా ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.
పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ రోకా వేడుక (Roka Ceremony)లో చోప్రా ఫ్యామిలీతోపాటు నీలం కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇక ఈ వేడుకల్లో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పీసీ భర్త నిక్, కూతురు మల్తీతో కలిసి వేడుకలో సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను గ్లోబల్ స్టార్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. కాబోయే జంటకు శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు తమ రోకా వేడుకకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను సిద్ధార్థ్ – నీలం కూడా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు కాబోయే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నీలం ఉపాధ్యాయ తమిళ్, తెలుగు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
Also Read..
Suriya -Jyothika | జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్న సూర్య, జ్యోతిక.. వీడియో
Taylor Swift: బిలియనీర్ల జాబితాలో పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్
Premalu OTT | ఎట్టకేలకు ఓటీటీలోకి ‘ప్రేమలు’.. మరింత ఆలస్యం కానున్న తెలుగు వెర్షన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

