రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందించిన క్రైమ్ యాక్షన్ లవ్‌స్టోరీ ‘డేంజరస్’. నైనా గంగూలీ, అప్సరా రాణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌తో పాటు పే పర్ వ్యూ పద్దతిలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలోని ఓ పాటను రామ్‌గోపాల్‌వర్మ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని డేంజర్ టోకెన్స్, డాలర్స్ మరియు క్రిప్టో కరెన్సీ ద్వారానైనా కొనుగోలు చేసి చూడొచ్చని రామ్‌గోపాల్‌వర్మ తెలిపారు. వినూత్న కథాంశంతో ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో సినిమా ఆకట్టుకుంటుందని ఆయన చెప్పారు.